ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఫాహధ్ ఫాజిక్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్యపాత్రలలో కనిపించనుండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8 వ తేదీన ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా యొక్క టీజర్ ఎన్నో రికార్డు లను దాటుకొనీ ఇండియా లోనే ఓ విషయంలో 4 వ స్థానంలో నిలిచింది.

అసలు విషయం లోకి వెళితే ... "పుష్ప పార్ట్ 2" మూవీ టీజర్ కేవలం విడుదల అయిన 24 గంటల సమయంలో 1.25 మిలియన్ లైక్స్ ను సాధించింది. ఇక "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 4.268 మిలియన్  లైక్స్ ను సాధించగా ... మాస్టర్ మూవీ టీజర్ 1.5 మిలియన్ లైక్స్ ను ... సలార్ మూవీ టీజర్ 1.672 లైక్స్ ను సాధించింది. ఇలా "పుష్ప పార్ట్ 2" మూవీ టీజర్ ఎన్నో రికార్డులను దాటుకొని ఇండియాలోనే విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టీజర్ ల విషయంలో టాప్ 4 లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa