సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ దృశ్య ఇక వారు ఎక్కడ కనిపించినా కూడా జనాలు గుమ్మిగూడుతూ ఉంటారు. తమ అభిమాన సెలబ్రిటీలతో ఫోటోలు తీసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఫోటోలు తీసుకోవడం విషయంలో కొంతమంది అభిమానులు మాత్రం కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో అయితే స్టార్ హీరోయిన్లను అభిమానులు ఫోటో తీసుకోవడానికి వచ్చి అసభ్యంగా తాకుతూ ఉన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 ఇలా సినీ సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సెక్యూరిటీని దాటుకొని వచ్చి మరి ఫోటోలు తీసుకోవడానికి కాస్త అతి చేస్తూ ఉంటారు అని చెప్పాలి  ఇక ఇటీవల హైదరాబాద్ లోని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చిన కాజల్ అగర్వాల్ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కాజల్ తో ఫోటో దిగడానికి వచ్చిన ఒక అభిమాని ఆమెకు దగ్గరగా వచ్చి నడుము మీద చేయి వేయబోయాడు. దీంతో అప్రమత్తమైన కాజల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన గురించి మరవకముందే బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ దేశాయ్ కి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.


 ఇటీవల ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది ప్రాచీ దేశాయ్. అయితే ఎయిర్పోర్ట్ బయటికి వచ్చిన తర్వాత అభిమానులు కోరడంతో కొంతమందితో ఫోటోలు దిగింది. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి సెల్ఫీ అడగడంతో కాదనలేక ఫోటో దిగింది. అయితే అతను హీరోయిన్ కు ఏదో బాగా తెలిసిన ఫ్రెండులా ఆమె భుజానికి డాష్ ఇచ్చి హత్తుకుని నిలుచుని ఫోటో దిగాడు. అంతేకాకుండా హీరోయిన్ ని అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడు. ఇక ఇది చూసిన నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: