టాలీవుడ్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవపరంలేదు. ఇప్పటికి చాలామంది హీరోయిన్లకు కెరీర్ పరంగా సక్సెస్ కోసం వేణు స్వామి పూజలు చేయించిన సంగతి తెలిసిందే.ఇప్పటికి వేణు స్వామితో పూజలు చేయించుకుంటున్న హీరోయిన్స్ ఫోటోలు నెటింట వైరల్‌గా మారుతూనే ఉన్నాయి. అయితే వేణు స్వామి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమ్మాయిల పూజలకు నేను డబ్బులు తీసుకోనని.. షాకింగ్ కామెంట్స్ చేశరు. నాకు హీరోయిన్స్ కాకుండా డబ్బులు ఇచ్చే పెద్ద పెద్ద క్లైంట్స్‌ ఉన్నారని ఆయన చెప్పుకొచ్చాడు. పొలిటికల్ టాప్ బిజినెస్ మ్యాన్స్ నాకు క్లైంట్స్‌ అంటూ వివరించాడు. జ్యోతిష్యం చెప్పి డబ్బులకు కక్కుర్తి పడే స్టేజ్ లో నేను లేనని.. వేణు స్వామి వివరించాడు.

 నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందని.. పబ్ అమ్మేశానని వేణు స్వామి వివరించాడు. రష్మిక నాకు డబ్బులు ఇచ్చారని.. వేరే ఏ హీరోయిన్ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు అంటూ చెప్పుకోవచ్చిన వేణు స్వామి టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ మ్యాజిక్ ఆచారంగా ఉందని.. హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు తమకు పోటీగా ఉన్న వాళ్ళు ఎదగకుండా చేస్తున్న సందర్భాలు ఉన్నాయంటూ వివరించాడు. ఎవరైతే అనుమతి ఇస్తారో ఆ సెలబ్రిటీల గురించి మాత్రమే నేను వీడియో పెడతానని.. ఆయన షేర్ చేసుకున్నాడు. హీరోయిన్లు డబ్బులు బలవంతంగా ఇస్తామని చెప్పినా.. గ్రూపులో పూజ చేసిన పండితులకు రూ.50,000 ఇవ్వమని మాత్రమే చెబుతానని ఆయన వెల్లడించాడు.

 ఇక టాప్ వ్యాపారవేతల నుంచి నాకు రూ.10 లక్షలు వస్తాయని అమ్మాయిలలో నేను అమ్మవారిని చూస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. కరోనా టైంలో ఓ వృత్తులో పని చేసే అమ్మాయిలకు నేను రూ.40 లక్షలు డొనేట్ చేశానంటూ వెల్లడించాడు. ఇలా అమ్మాయిలకు నేను సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని.. అమ్మాయిలకు హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు పంచిన రోజులు కూడా ఉన్నాయంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు. శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పాలని.. మద్యం గురించి మాట్లాడడమే దోషం అంటూ వివరించాడు. చేసిన ప్రతి తప్పుకు దానమే పరిహారం అంటూ ఆయన వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: