మరికొన్ని రోజుల్లో రాబోయే ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి గుర్తింపు కలిగిన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు పొత్తులో భాగంగా పోటీ చేయబోతున్నాయి. ఇక ఈ పొత్తును అనౌన్స్ చేసి కూటమిలో భాగంగా పోటీ చేయబోతున్నట్లు ఈ మూడు పార్టీలు ప్రకటించిన తర్వాత జనాల్లో ఈ కూటమిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వైసీపీ ఒక పార్టీ ఒక వైపు ... ఈ మూడు పార్టీలు ఒక వైపు ఉండడంతో ఈ సారి కచ్చితంగా కూటమి ఆంధ్రప్రదేశ్ లో గెలుపు జెండా ఎగరవేస్తోంది అని చాలా మంది జనాలు భావించారు.

ఇలా కొంత కాలం సాగింది. ఇక ఎప్పుడు అయితే టికెట్ల పంపిణీ ప్రారంభం అయ్యిందో అప్పటి నుండి కూటమిలో చిత్ర విచిత్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సీట్ల పంపిణీ విషయంలో కొన్ని పార్టీల్లో చాలా కాలంగా పని చేసే ప్రజల్లో మంచి మైలేజ్ ఉన్న వ్యక్తి కి కాకుండా ఆ ప్రాంత టికెట్లు వేరే వాళ్లకు వెళ్లడంతో అక్కడి పార్టీ నాయకులు వేరే పార్టీలో చేరడం , లేకపోతే రెబల్స్ లా పోటీ చేస్తామని భయపెట్టడం ఇలా కొన్ని కారణాల వల్ల ఒక పార్టీలోని వ్యక్తి మరో పార్టీ కండువా కప్పుకొని టికెట్లు దక్కించుకోవడం మరి కొంత మంది పక్క పార్టీకి వెళ్లి టికెట్ దక్కించుకోవడం ఇలా అనేక పరిస్థితులు ఇన్ని రోజులు జరిగాయి.

ఇక కొన్ని రోజుల క్రితమే నామినేషన్ల పర్వం కూడా మొదలు అయింది. ఇక ఇప్పటికి కూడా కూటమిలో ఇదే పరిస్థితి వనపర్తి సీటు విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. దీని విషయంలో తర్జనభజన పడుతున్నారు. మరొకటి రెండు రోజుల్లో ఈ సీటు ఎవరికి దక్కుతుంది అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఇకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. నంద్యాల , నందికొట్కూరు , ఎమ్మిగనూరు , మంత్రాలయం , ఆదోని , కోడుమూరులో కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్‌ వేయగా.. బీజేపీ తరఫున మురహరిరెడ్డి కూడా పార్టీ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా రెబల్‌గా నామినేషన్ వేశారు. నంద్యాల టీడీపీ లోనూ ఇదే పరిస్తితి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని.. టీడీపీ ఫరూక్‌ కి టికెట్ ఇచ్చింది. దాంతో.. బ్రహ్మానందరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిగిలిన నాలుగు చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇలా సీట్ల పంపిణీ విషయంలో క్లారిటీ లేకపోవడంతో కూటమిలో ఇప్పటికే కూడా చిత్రం విచిత్ర పరిస్థితులు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: