డాన్స్ కొరియో గ్రాఫర్ , నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాల్లో ఎన్నో పాటలకు డ్యాన్స్ కొరియో గ్రాఫర్ గా పని చేసి అద్భుతమైన డాన్సర్ గా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి నటుడి గాను ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడి గాను తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

ఇకపోతే రాఘవ లారెన్స్ సినిమాల్లో హీరో గా నటించి అందులోని తన పాత్ర ద్వారా పేదలకు ఎంత న్యాయం చేస్తూ ఉంటాడో నిజ జీవితంలో కూడా ఆయన అంతకన్నా ఎక్కువనే పేద ప్రజలకు న్యాయం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈయన ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు , పెద్దలకు వైద్య సేవలను అందించాడు. అలాగే ఎంతో మంది పేదలకు ఎన్నో సహాయాలను చేశాడు.

ఇది ఇలా ఉంటే గతంలో ఈయన పేద రైతులకు ట్రాక్టర్ లను ఇస్తాను అని చెప్పాడు.  ఇచ్చిన హామీని తాజాగా రాఘవ లారెన్స్ నెరవేర్చుకున్నాడు. తాజాగా ఈయన పది మంది కి తలో ట్రాక్టర్ ను అందజేశారు. మొదటి ట్రాక్టర్ ను విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు  కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలుద్దాం ... ఆనందం పంచుదాం అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇకపోతే ఈయన పేద రైతులకు ట్రాక్టర్లు పంచడం ఎంతో మంది నిరుపేదలకు అనేక సహాయాలను చేయడం అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడంతో ఈయనకు దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: