తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు. అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇటీవలే రిలీజైన 'ది క్రూ' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు. అందులో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఏకంగా 150 కోట్లకు పైగా వసూళ్లు సాందించింది.42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుుంది.రీసెంట్గా విడుదలైన 'క్రూ' సినిమాతోనూ భారీ హిట్ను అందుకుుంది.ఇందులో తనదైన శైలిలో నటించి ప్రశంసలు దక్కించుకుుంది.సినిమాలో కృతి సనన్,కరీనాకపూర్ లతో పోటీపడుతూ వారిని డామినేట్ చేసింది.ఇదిలా ఉంటే..ఈ సీనియర్ బ్యూటీ హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.ఫేమస్ హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌ డ్యూన్ పార్ట్-3 లో నటించనున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో టబు నటిస్తుందట. ఇందులో ఆమె పాత్రను "బలమైన, తెలివైన మరియు ఆకర్షణీయమైన' పాత్రగా క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు చక్రవర్తి ప్రేయసిగా ఉన్న ఆమె తిరిగి ప్యాలెస్‌కు రావడంతో ఇది మొదలువుతుంది' అంటూ టబు పాత్ర గురించి మ్యాగజైన్‌ పేర్కొంది. దీంతో అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పాత్ర పొందినందుకు నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ 'డ్యూన్‌: ప్రాఫెసీ' సిరీస్‌ను మొదట 2019లో ప్రకటించారు.త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.అంధాధున్, దృశ్యం 2, భూల్ భూలయ్యా 2 వంటి కొన్ని బ్లాక్‌ బస్టర్ చిత్రాల తర్వాత టబు నటించిన మరో హిట్ సినిమాగా క్రూను చెప్పవచ్చు.ఇందులో సరికొత్త కోణాన్ని టబులో చూశారు ఆడియన్స. మరి ఇప్పుడు హాలీవుడ్ సిరీస్ లో ఎలా కనిపించబోతుందో చూడాలి.వరల్డ్ వైడ్ గా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డ్యూన్ సిరీస్లో అవకాశం అందుకుంది. త్వరలో అదే టైటిల్ కి ప్రోఫెసిని జోడించి భారీ బడ్జెట్ తో ఈ ప్రీక్వెల్ తెరకెక్కించనున్నారు. ఇందులో టబు సిస్టర్ ఫ్రాన్సెస్ గా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఇండియా వైడ్ గా టబు పేరు మరోసారి మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్లో ఛాన్స్ అందుకోవడమంటే మాములు విషయం కాదని.. టబు చాలా లక్కీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఈ సీరిస్ రిలీజ్ కావడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టొచ్చని పలువులు అంచనా వేస్తున్నారు.రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచిన హైదరాబాదీ బ్యూటీ టబు. మూడు దశాబ్దాల క్రితం వెంకటేష్ 'కూలీ నంబర్ 1′ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన టబు.. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. వయసుతో నిమిత్తం లేకుండా అప్పటి నుంచి ఇప్పటివరకూ వరుస సినిమాలతో బిజీగా సాగుతూనే ఉంది ఈ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: