యానిమల్‌తో బ్లాక్‌ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో నేషనల్ క్రష్‌ రష్మిక. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ జోడీగా కనిపించనుంది.సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప పార్ట్‌-1కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పుష్పలో శ్రీవల్లిగా సినీ ప్రియులను అలరించింది. దీంతో పుష్ప-2 చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సింగిల్‌పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. సెకండ్ సింగిల్ సంబంధించిన రిలీజ్ డేట్‌ను  అనౌన్స్‌చేయబోతున్నట్లు ప్రకటించారు.ఈ సెకండ్ సింగిల్‌లో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న కలిసి కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.శ్రీవల్లితో తన సామీతో కలిసి కపుల్ సాంగ్ ద్వారా అభిమానులను మెస్మరైజ్ చేయడం ఖాయమని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. సెకండ్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి సూపర్ అని అర్థం వచ్చేలా రష్మిక చేతి వేళ్లను మాత్రమే చూపిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మాస్ రొమాంటిక్ డ్యూయెట్‌గా ఈ సాంగ్ సాగనున్నట్లు తెలుస్తోంది.ఇటీవల విడుదలైన చేసిన బన్నీ స్పెషల్ గ్లింప్స్ చూస్తే ఈ ఏ రేంజ్‏లో ఉంటుందో అర్థమవుతుంది. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్, పోస్టర్స్ పుష్ప 2పై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.

 తాజాగా రెండో సాంగ్ ప్రోమో విడుదల చేసింది చిత్రయూనిట్. ఆ వీడియోలో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే.. కేశవా వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా..ఆ పాటేందో చెప్తావా అని అడగ్గా.. రష్మిక నడుస్తూ.. సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. అంటూ పాట పాడుతూ పుష్పరాజ్ సిగ్నెచర్ స్టెప్ వేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరలవుతుంది.ఇదిలా ఉండగా.. రష్మిక తాజాగా చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్‌ డాగ్స్‌, క్యాట్స్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. మీతో సమయం వెచ్చించడం నాకు చాలా ఉత్సాహంగా ఉంటుందని రాసుకొచ్చింది. మీతో ఉన్న అద్భుతమైన క్షణాలను పంచుకోకుండా ఉండలేకపోతున్నా అంటూ పోస్ట్ చేసింది.అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక దిగిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ పెట్‌ డాగ్‌ కూడా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఫ్యాన్స్‌ శ్రీవల్లి బ్యూటిఫుల్‌ పిక్స్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక షేర్ చేసిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ పెట్‌డాగ్‌ కూడా కనిపించడంతో ఫ్యాన్స్‌ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలో రష్మిక చాలాసార్లు విజయ్ ఫ్యామిలీతో కనిపించింది. దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు రూమర్స్‌ కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: