ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కథనాయికగా నటించగా.. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, ఫస్ట్ సింగల్ మూవీ పై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. పుష్ప 2 తో సుకుమార్- అల్లు అర్జున్ మరో సారి రికార్డులు తిరగరాయడం ఖాయమని తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే ఇటీవలే సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ వీడియో రిలీజ్ చేయగా.. నెట్టింట ఫుల్ ట్రెండ్ అయ్యింది. మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది.అయితే తాజాగా ఈ సాంగ్.. లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్, రష్మిక ప్యాంట్- టీ షర్ట్ పై ఓణీ వేసుకొని డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఇక చూస్తుంటే పార్ట్ 1 లో ‘సామి సామి’ మించి ఈ పాట ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్న ఈ పాట మిలియన్ల లో వ్యూస్ రాబట్టడం ఖాయమని అర్ధమవుతోంది.ఈ పాటను పాపులర్ సింగర్ శ్రేయాఘోషల్ పాడింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ అన్ని భాషల్లోనూ శ్రేయో ఘోషల్‌ పాడటం విశేషం. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే’ కపుల్ సాంగ్ రేపు 11 గంటలకు రిలీజ్ కానున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ సినిమాకు టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.అయితే రష్మిక షేర్ చేసిన పోస్టర్‌లో అల్లు అర్జున్‌ ఎదపై రష్మిక సంతోషంగా వాలినట్లు ఉంది. ప్రస్తుతం ఈ పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా పుష్ప-2 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: