నటశేఖర కృష్ణ కుమార్తె ప్రియదర్శినిని పెళ్లి చేసుకొని సూపర్ స్టార్ అల్లుడిగా మారిన సుధీర్ బాబు.. 'ఏ మాయ చేసావే' సినిమాతో తెరంగేట్రం చేసారు. 'SMS - శివ మనసులో శృతి' చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నారు. ఈ విధంగానే 'ప్రేమ కథా చిత్రం', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ', 'భలే మంచి రోజు', 'శమంతకమణి', 'సమ్మోహనం' వంటి చిత్రాలతో అలరించారు. అయితే గత కొన్నాళ్లుగా సుధీర్ బాబు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'హరోం హర' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. 'హరోం హర' అనేది 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. ది రివోల్ట్ అనేది దీనికి ట్యాగ్‌లైన్. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవరైన సుధీర్ బాబు కుప్పం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.ఈ చిత్రం జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి