పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో అనగా 2014వ సంవత్సరంలో జనసేన అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈయన కొంతకాలం పాటు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ పనులను కూడా చక్కబెడుతూ వచ్చాడు. ఇలా రెండు పనులను చేయడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో పవన్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పినట్లు కూడా ప్రకటించాడు. కానీ ఆ తర్వాత అభిమానులు పెద్ద ఎత్తున ఖచ్చితంగా సినిమాలు చేయండి.

సంవత్సరానికి ఒక్క సినిమా వచ్చిన పర్లేదు కానీ సినిమా చేయండి అని అనేకమంది అడగడంతో పవన్ వారి కోరిక మేరకు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక పవన్ కొంత కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా షూటింగ్ కొంత భాగం అయిన తర్వాత పవన్ రాజకీయ పనులతో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దానితో ఈ సినిమా దర్శకుడు అయినటువంటి క్రిష్ జాగర్లమూడి ఆ గ్యాప్ లో కొండపొలం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే పవన్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ,  సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీలను స్టార్ట్ చేశాడు.

ఈ మూవీలకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తి కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ల హడావిడి ప్రారంభం అయింది. దానితో పవన్ సినిమా షూటింగ్లను పక్కన పెట్టి రాజకీయాలపై దృష్టి సారించారు. దానితో ఇప్పట్లో పవన్ ఫ్రీ కావడం కష్టం అనే ఉద్దేశంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ దర్శకుడు హరీష్ శంకర్ ఈ గ్యాప్ లో రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా కొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. పవన్ కమిట్ అయిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి మూవీ ల దర్శకులలో క్రిష్ జాగర్లమూడి గ్యాప్ లో ఓ మూవీ ని కంప్లీట్ చేశాడు. హరీష్ శంకర్ ప్రస్తుతం ఓ మూవీ ని కంప్లీట్ చేస్తున్నాడు. ఇక సుజిత్ ఒక్కడే ఈ లిస్టులో వేరే సినిమాపై దృష్టి పెట్టకుండా కేవలం పవన్ మూవీ పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: