టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కార్తికేయ ఇటీవల భజే వాయు వేగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దీనికంటే ముందు బెదురులంక సినిమాతో భారీ విజయం తర్వాత భజే వాయువేగం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కార్తికేయ. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇకపోతే ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా కనిపించింది. మొదటి నుండే టీజర్ ట్రైలర్ పోస్టర్తో భజే వాయువు వేగం పై అంచనాలను పెంచేసిన చిత్ర బృందం మే 31న

 గ్రాండ్గా విడుదల చేసింది. ఇక థియేటర్స్ లో పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమాలను వసూళ్ళు కూడా బాగానే అందుకుంది. అలా బెదురులంక సినిమా తర్వాత ఈ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కార్తికేయ. అయితే థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కూడా కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటిటి దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు దీనికోసం ఈ రెండు సంస్థలు భారీ డీల్

 కుదుర్చుకున్నాయట. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది.. అన్నీ కుదిరితే ఈ నెల జూన్‌ 28న భజే వాయు వేగం ను స్ట్రీమింగ్‌కు తీసుకురావచ్చని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై భజే వాయు వేగం తెరకెక్కింది.హ్యాపీ డేస్‌ ఫేం రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, కృష్ణ చైతన్య, సుదర్శన్,శరత్ లోహితస్వ, రవిశంకర్, కీలకపాత్రలు పోషించారు. తదితరులు ఈ లో కీలక పాత్రలు పోషించారు. కపిల్ కుమార్ ఈ కు సంగీతం అందించారు. క్రికెట్ బెట్టింగ్, యాక్షన్, ఛేజింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: