సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం గుంటూరు కారం అనే కమర్షియల్ ప్లేస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... శ్రీ లీలా , మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా నటించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశం నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ లీల , మీనాక్షి చౌదరిమూవీ లో మహేష్ కు జోడిగా నటించగా ... ప్రకాష్ రాజ్ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

రమ్యకృష్ణ ఈ మూవీ లో మహేష్ కి తల్లి దండ్రుల పాత్రలో నటించగా ... రావు రమేష్ , రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలం అయింది. ఆయనప్పటికీ మహేష్ బాబు క్రేజ్ , సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ తో ఈ మూవీ గట్టిగానే కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఇకపోతే ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిన ఈ సినిమా ఒక రేర్ రికార్డు ను సృష్టించింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్ లో 200 రోజులను పూర్తి చేసుకుంది. ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఈ మూవీ 200 రోజులు ఒక థియేటర్లో ఆడడం అనేది ఒక గొప్ప రికార్డు అని చెప్పవచ్చు. ఇలా గుంటూరు కారం సినిమా ఓకే థియేటర్లో 200 రోజులు ఆడి అద్భుతమైన రికార్డును అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: