టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో పుష్ప పార్ట్ 2 మూవ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా సుకుమార్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక మొదట ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. దానితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ తేదీకి దగ్గర ఏ పెద్ద సినిమా విడుదల తేదీలను కూడా ప్రకటించలేదు. ఇక డిసెంబర్ 6 వ తేదీకి ఈ సినిమా పోస్ట్ పోన్ కావడంతో ఆ తేదీ దగ్గర ప్రాంతంలో మాత్రం చాలా సినిమాలే విడుదలకు రెడీగా ఉన్నాయి. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన గేమ్ చేంజెర్ సినిమా డిసెంబర్ 20 వ తేదీన విడుదల కావడానికి రెడీగా ఉంది.

మూవీ యొక్క విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయిన ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ కి బ్లాక్ బస్టర్ వచ్చి ఆ తర్వాత విడుదల అయిన గేమ్ చేంజర్ మూవీ కి కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే పుష్ప పార్ట్ 2 మూవీ కి డిసెంబర్ 20 వ తేదీ తర్వాత కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. దాని వల్ల పుష్ప పార్ట్ 2 కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్సెస్ చాలా వరకు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: