అయితే ఇప్పుడు తాజాగా తాప్సి మరొక విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే నెట్ ఫ్లిక్స్ వేదికగా గాంధారి అనే ఒక సరికొత్త టైటిల్ ని చిత్ర బృంద ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తూ ఒక చిన్న వీడియో క్లిప్ ను కూడ రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం. ఇందులో తల్లి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ తెలియజేసింది. అలాగే తన బిడ్డ విషయానికి వస్తే ఆమె ప్రపంచాన్ని తలకిందులు చేస్తుందని ఒక డైలాగుతో ఈ వీడియో ఉన్నది.
దీన్ని బట్టి చూస్తే ఇది తల్లి, కూతుర్ల సెంటిమెంట్ సినిమా అని కూడా చెప్పవచ్చు. అయితే ఇందులో తాప్సి తల్లి క్యారెక్టర్ లో కనిపించబోతోందని ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అన్ని విషయాలు కూడా చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సరికొత్త కథ అంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాప్సి ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. అంతేకాకుండా గడిచిన కొన్ని నెలల క్రితం తాప్సి సీక్రెట్ గా తన ప్రేమించిన వారిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా తాప్సి బయటపడకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తోంది.