మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో ఎన్నో హిందీ సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును బాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగులో సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాను ఇండియాలో చాలా పెద్ద ఎత్తున విడుదల చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్ సెల్లర్ అనే హాలీవుడ్ మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయ్యి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేశారు. ఇక పుష్ప పార్ట్ 2 విడుదల కావడంతో ఇండియాలో ఈ సినిమాకు థియేటర్లు దొరకలేదు.

దానితో ఈ మూవీ విడుదలను ఇండియాలో క్యాన్సల్ చేశారు. ఇక పుష్ప 2 వల్ల ఇండియాలో ఇంటర్ సెల్లర్ మూవీ విడుదల కాకపోవడంతో కొంత మంది నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ చేయడంతో జాన్వీ కపూర్ వాటి పై స్పందిస్తూ ... ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. అలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని ఈ బ్యూటీ స్పందించింది. దానితో ఈమెపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: