- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . .


ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్పరాజ్ గాడి హ‌వా కనిపిస్తోంది. ఐదు రోజులకే 900 కోట్లకు పైగా వసూళ్లు అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం థియేటర్లలో జనాలను గెంతులు వేయించి ప్రేక్షకుల మనసులను వేటాడిన సినిమా ఎన్టీఆర్ - రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన వేటగాడు. 55 ఏళ్ల ఎన్టీఆర్ 15 ఏళ్ల అతిలోక సుందరితో పోటీపడి మరి డ్యాన్సులు వేసిన సినిమా అది. 1979లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. 40 సెంటర్లలో 50 రోజులు .. 29 సెంటర్లలో వంద రోజులు .. నాలుగు సెంటర్లలో సిల్వర్ జూబ్లీ హైదరాబాద్లో 408 రోజులు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఆకుచాటు పిందితడిసే పాటలో ఇద్దరు పోటీపడ్డారు. వేటగాడు శత దినోత్సవ ఫంక్షన్ లో అక్కినేని ... రాఘవేంద్రరావుకు ఓ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. శ్రీదేవిని సాగదీశారు అని .. ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ 15 ఏళ్లలో 20 ఏళ్ల పరిపక్వత ఉన్న యువతి లాగా ఆమె కనిపిస్తోంది.


జనాన్ని విప్పేసిన మరో పాట పుట్టింటోళ్లు తరిమేశారు .. కట్టుకున్నోడు వదిలేసాడు.. జయమాలినతో పోటీగా డ్యాన్స్ చేశారు. ఎన్టీఆర్ అలాగే బంగారు బాతు గుడ్డు - ఓసోసి పిల్ల కోడిపెట్ట పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. పాటలన్నీ వేటూరి రాశారు. ఈ పాటలకు సంగీతం ఇచ్చింది చక్రవర్తి కథ రొటీన్ అనిపించకుండా బ్రహ్మాండంగా రాశారు. అడవి రాముడు - యమగోల సినిమాల తర్వాత తెలుగు సినీ రంగాన్ని కలెక్షన్ల సునామీలో అదరగొట్టిన సినిమా వేటగాడు వాస్తవానికి ఈ సినిమాలో నటించడానికి శ్రీదేవి తటపటాయి స్తున్న వేళ ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఆమెను ఒప్పించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను జితేంద్ర - పూనం థిల్లాన్ తో  హిందీలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. నిర్మాతలు అర్జునరాజు - శివరామరాజుకు కావలసినంత డబ్బు తెచ్చి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: