జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పరంగా ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా ఆయన క్రేజ్ మాత్రం తగ్గడం లేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అయితే పవన్ హరిహర వీరమల్లు సినిమా ప్యాచ్ వర్క్ మినహా దాదాపుగా పూర్తైందని మే నెలలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
 
హరిహర వీరమల్లు మూవీ ఏపీ హక్కులు 100 కోట్ల రూపాయలు చెబుతున్నారని సమాచారం అందుతోంది. సీడెడ్, నైజాం హక్కులు సైతం కలిపితే హరిహర వీరమల్లు మొత్తం హక్కులు 170 కోట్ల రూపాయలను క్రాస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్ల పెంపు విషయంలో సైతం ఏపీలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పవచ్చు.
 
హరిహర వీరమల్లు మూవీ ఇతర భాషల్లో సైతం ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందనే చర్చ జరుగుతుండటం గమనార్హం. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. హరిహర వీరమల్లు మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతోంది.
 
హరిహర వీరమల్లు మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండగా పవన్ పారితోషికం సైతం భారీ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. రాజకీయాల్లో, సినిమాల్లో సంచలనాలు సృష్టించిన వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. ఆ ఘనత సొంతం చేసుకున్న వాళ్లలో పవన్ సైతం ఒకరని చెప్పవచ్చు. హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడం కూడా పవన్ కళ్యాణ్ కు సులువు కాదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: