తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా అనే  పదాన్ని పరిచయం చేసింది ప్రభాస్. ఈయన కంటే ముందు కొంతమంది చేశారు కానీ ప్రభాస్ లా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీని నిలబెట్టిన  నటుడు మాత్రం లేరని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వీడు, వీని వాలకానికి సినిమాల్లో సెట్ అవుతాడా అని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయనతో తక్కువలో తక్కువ వెయ్యికోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడానికి కూడా దర్శక, నిర్మాతలు   మాత్రం క్యూ కడుతున్నారు. ఆ విధంగా బాహుబలి సినిమా ద్వారా  తాను ఎదగడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని కూడా ఎల్లలు దాటించిన గొప్ప హీరో అని చెప్పవచ్చు. ప్రభాస్ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే మనస్తత్వం. 

తన దగ్గరికి ఎవరు వెళ్లినా కానీ మనస్ఫూర్తిగా ఆహారంతో ఆతిథ్యమిచ్చి కడుపు నింపుతారట. ముఖ్యంగా శత్రువుల కైనా సరే ఆహారం పెట్టడంలో ప్రభాస్  ను మించిన వారు లేరు. అలాంటి ప్రభాస్ అందరితో బాగా కలిసి పోతారు కానీ ఆ ఒక్క హీరోతో విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతే కాదు ఆ హీరో నెంబర్ ను కూడా ప్రభాస్ బ్లాక్ లిస్టులో పెట్టాడట. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే నందమూరి నటసింహం బాలకృష్ణ. అయితే ప్రభాస్ కు బాలకృష్ణ మీద నిజంగా కోపం లేదండోయ్.. ఇటీవల ఆయన నిర్వహించినటువంటి అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ ముఖ్య అతిథిగా వెళ్లారు.

ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి చాలా ఆనందంగా మాట్లాడుకున్నారు. ఇదే తరుణంలో బాలయ్య అందరిని మీ ఫామ్ హౌస్ కి పిలిచి పార్టీ ఇచ్చావు నన్ను ఎప్పుడు పిలువ లేదంటూ ప్రశ్నించాడు.. మరొక మూడు నెలల్లో మీతో గట్టి పార్టీ చేద్దాం మెన్షన్  హౌస్ తో మా ఫామ్ హౌస్ లో కూర్చుందాం సార్ అంటూ చెప్పుకోచ్చారు. అసలు నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయాలి కదా నేను ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తూ చివరికి బ్లాక్ లిస్టులో పెట్టేసావ్ అంటూ బాలయ్య అనగా ప్రభాస్ నవ్వుతూ మ్యాన్షన్ హౌస్ తో మా ఫామ్ హౌస్ తప్పకుండా 3 నెలలో రెడీ అంటూ బాలయ్యతో ప్రభాస్ అన్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: