వేసవికాలం వచ్చేసింది. పిల్లలకు వేసవి సెలవులు కూడా వచ్చేసాయి. ఇంకేముంది పిల్లలందరూ టీవీకి అతుక్కుపోయి ఉంటారు. ఒకప్పుడు అంటే పిల్లలు వేసవి సెలవులు వస్తే చాలు ఇంటిపట్టున కనిపించే వారే కాదు. కానీ ఇప్పుడు సెలవులు వస్తే మాత్రం పిల్లలు టీవీకి అలవాటు పడిపోతున్నారు. అయితే ఈ క్రమంలో పిల్లలు మిస్ కాకుండా చూడాల్సిన ఒక ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ ఐదు స్పెషల్ సినిమాలు ఏంటో..  అవి ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఐయామ్ కలాం అనే సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ 2011లో రిలీజ్ అయ్యి మంచి ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా రోడ్ సైడ్ ఉండే చిన్న టీ షాప్ లో పనిచేసే కలాం గురించి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా చదువుకోవాలనే సంకల్పం ఉంటే చాలు దేన్నైనా సాధించగలం అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు. 12th ఫెయిల్ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలో ఆడుతోంది. ఈ సినిమా విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంది. ఒక్క 12th ఫెయిల్ అయినంత మాత్రన చదువు విఫలం కాదని ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈ మూవీ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందించింది.

శకుంతలా దేవి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంది. ఈ మూవీ హ్యూమన్ కంప్యూటర్ గా గుర్తింపు పొందిన భారత గణిత శాస్త్ర దిగ్గజం శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో విద్యాబాలన్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ మూవీ మ్యాథమెటిక్స్ ని సులువుగా నేర్చుకోవచ్చని తెలుపుతుంది. తారే జమీన్ పర్ సినిమా 2007లో రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పక చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లల టాలెంట్ ఏంటో తెలుసుకోకుండానే ఇతర పిల్లలతో పోల్చడం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికీ, ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందని ఈ మూవీ తెలుపుతుంది. ఈ సినిమా యూట్యూబ్ లో కూడా ఉంది. స్టాన్లీ కా డబ్బా సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆడుతోంది.  ఈ సినిమా యూట్యూబ్ లో కూడా ఉంది.  ఈ మూవీ స్టాన్లీ అనే నాలుగో తరగతి పిల్లాడి గురించి ఉంటుంది. మూవీలో స్నేహం యొక్క విలువలు చాలా బాగా చూపించారు. ఈ సినిమాని పిల్లలు తప్పకుండా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: