టాలీవుడ్ హీరో నితిన్ ఈ మధ్యకాలంలో తన సినిమాలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. అయినా కూడా సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ ఉన్నారు నితిన్. తాజాగా నితిన్ నటిస్తున్న తమ్ముడు చిత్రం జులై 4వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తూ ఉండడంతో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ఈ డైరెక్టర్ వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించారు.


ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ తమ్ముడు సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ డేట్ ని కూడా చిత్ర బృందం ప్రకటించారు. ఇందులో హీరో నితిన్ కి అక్క పాత్రలో అలనాటి హీరోయిన్ లయ కూడా నటిస్తూ ఉన్నది. హీరోయిన్గా సప్తమి గౌడ నటిస్తోంది .ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని గత కొంతకాలంగా పలు రకాల రూమర్స్ రావడంతో ఇప్పుడు తాజాగా అధికారికంగా చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది.


డైరెక్టర్ శ్రీరామ్ తో పాటుగా చిత్ర బృందం కూడా బర్తడే విషెస్ ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు.. ఇందులో లయతో పాటుగా వర్ష బోలమ్మ, సప్తమి గౌడ, స్వస్తిక ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్నారు. ఈ వీడియో ద్వారానే రిలీజ్ డేట్ ని కూడా తెలియజేశారు చిత్ర బృందం. ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడదాం ? అసలు తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంపైనే అందరూ డైరెక్టర్ వేణు శ్రీ రాముని ప్రశ్నించడం జరిగింది. ఈ వీడియో కూడా చాలా ఫన్నీ గానే కనిపిస్తోంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ బర్తడే కేక్ కట్ చేయించారు చివరిలో.

మరింత సమాచారం తెలుసుకోండి: