మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని అధికారికంగా లాంచ్ చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు , మరో కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన టోటల్ ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ను మే 22 వ తేదీ నుండి ప్రారంభించాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా నయనతార నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి నయనతార తో సంప్రదింపులు జరుపుతున్నట్లు అన్ని ఓకే అయితే నయనతారమూవీ లో హీరోయిన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

సంక్రాంతి పండక్కు ఈ సినిమాను విడుదల చేసే విధంగా ఈ మూవీ షూటింగ్ను పక్కా ప్లానింగ్ తో పూర్తి చేసే విధంగా ఈ మూవీ బృందం ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిషమూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: