ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తుంది. ఇక ఇప్పటికే క్రికెట్‌కు సంబంధించిన విషయంలోనూ భారత్ ప్రభుత్వం చాలా యేళ్లుగా సీరియస్ గా ఉంటోంది. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పర్యటించడం లేదు. ఇక ఐసీసీ ఈవెంట్స్ లో సైతం భారత్ - పాకిస్తాన్ తలపడాల్సి వచ్చినప్పుడు తటస్థ వేదికల మీదే భారత్ - పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయే తప్పా మన జట్టు పాకిస్తాన్‌లో పర్యటించడం లేదు. ఇక ఆసియా కప్ లో ఇప్పుడు భారత్ - పాకిస్తాన్ ఆడతాయా ? అసలు ఈ టోర్నమెంట్ ఉంటుందా ? అన్న సందేహాలు కూడా ముసురుకున్నాయి.
తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన అన్ని ప్లాట్‌ఫామ్‌లలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఓటీటీ, మీడియా ప్లాట్‌ఫామ్ లతో పాటు మిగతా ఎంటర్‌టైనింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పాకిస్థాన్ దేశానికి చెందిన కంటెంట్‌ను పూర్తిగా తొలగించాల్సిందిగా ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చింది. వెబ్ సిరీస్, చిత్రాలు, సాంగ్స్, పాడ్‌కాస్ట్ తదితర మీడియాల్లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న పాక్ దేశానికి చెందిన కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధన లు ఇప్పటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గా ల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి