తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి సురేఖ వాణి ఒకరు. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ఎంతగానో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో నటించి అభిమానులను సంపాదించుకుంది. ఓవైపు సినిమాలలో చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలోను నటించింది. 

ఇప్పటివరకు తన కెరీర్ లో అనేక సినిమాలలో నటించి విజయాన్ని అందుకుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సురేఖ వాణి చాలా హాట్ టాపిక్ గా మారుతున్నారు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సురేఖ వాణి తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలు షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సురేఖ వాణికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

రీసెంట్ గానే సురేఖ వాణి పుట్టినరోజు జరిగింది. అందులో సురేఖ వాణి తన ప్రియుడితో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా రోజుల నుంచి సురేఖ వాణి ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు, రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా త్వరలోనే సురేఖ వాణి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ వార్తలపై సురేఖ వాణి ఇంతవరకు రియాక్ట్ అవలేరు. ఇక పుట్టినరోజు వేడుకలు తన ప్రియుడితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లుగా ఓ వార్త విపరీతంగా వైరల్ గా మారడంతో త్వరలోనే సురేఖ వాణి వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయం పైన సురేఖ వాణి ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: