
ఈ మూవీ మరోసారి రీరిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ నేడు థియేటర్ లో విడుదల అయ్యి సందడి చేసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా రీరిలీజ్ వీడియోస్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ భారీ వసూళ్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బుకింగ్స్ గట్టిగానే నమోదు అయ్యాయి. చూడాలి మరి ఎంత కలక్షన్ వసూలు చేస్తోందో.
హిట్ తో సంబంధం లేకుండా మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు సైతం మరోసారి రీరిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హిట్ కొట్టిన మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్, భద్రి, హ్యాపీ డేస్ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే వాటితో పాటుగా ఫ్లాప్ అయిన సినిమాలు.. హీరో సిద్దార్థ్, బేబీ శ్యామలి తెరకెక్కించిన లవ్ స్టోరీ ఓయ్, రామ్ చరణ్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ఆరెంజ్ సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో పాటు కలక్షన్స్ కూడా బాగానే సొంతం చేసుకున్నాయి.