
సంక్రాంతి రేసులో నిలిచిన "డాకు మహారాజ్" సూపర్ డూపర్ హిట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది . కాగా ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ "అఖండ 2" సినిమా చేస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పాలా..? గూస్ బంప్స్ రావాల్సిందే. వీళ్ళ కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది. ఈ సినిమా గురించి పక్కన పెడితే బాలయ్య ఇప్పుడు మరో భారీ సీక్వెల్లో నటించబోతున్నాడు అన్న వార్త ఫుల్ ట్రెండ్ అవుతుంది .రజనీకాంత్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది.
అయితే ఈ సీక్వెల్ సినిమాలో నందమూరి బాలకృష్ణ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బాలయ్య క్యారెక్టర్ ను చాలా చాలా హైలెట్ అయ్యే విధంగా రాసుకున్నారట . అయితే సాధారణంగా గెస్ట్ రోల్ అంటే నాలుగు రోజులు లేదా మూడు రోజులు కాల్ షీట్స్ ఇస్తూ ఉంటారు . కానీ బాలయ్య మాత్రం ఈ సినిమా కోసం ఏకంగా 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు అంటూ ఓ న్యూస్ తెర పైకి వచ్చింది . అంటే బాలయ్య పాత్ర ఈ సినిమాకి ఎంత కీలకమో.. ఎంత హైలెట్ కాబోతుందో అర్థం చేసుకోవచ్చు .
కేవలం 20 నిమిషాల పాత్ర కోసం 20 రోజులు కాల్ షీట్స్ ఇచ్చారు అంటే బాలయ్య పెర్ఫార్మెన్స్ ఈ సినిమాల అద్దిరిపోతుంది అని .. బాలయ్య ఈ సినిమాతో మరొక సారి తన నటన విశ్వరూపం చూపించబోతున్నాడు అని నందమూరి ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఈ సినిమాల్లో మరొక స్పెషల్ క్యారెక్టర్లు ఇంకొక తెలుగు హీరో మెరబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియా ప్రజెంట్ జైలర్ 2 కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి..!