కోలీవుడ్ స్టార్ హీరో సంతానం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ హీరో కోలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ హీరో నటించే సినిమాలు అన్ని మంచి విజయాలు అందుకుంటాయి. తనదైన నటన, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఈ హీరో తాజాగా తిరుమల శ్రీవారి వివాదంలో చిక్కుకున్నారు. 

హీరో నటించిన డిడి నెక్ట్స్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవిందా పాట పేరడీ చేశారని హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నారు. తిరుమల శ్రీవారిని అవమానించారని హీరో సంతానంపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస గోవిందా పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస గోవింద పాటను తొలగించకపోతే వివాదాలలో చిక్కుకుంటారని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఈ విషయంపై తాజాగా హీరో సంతానం స్పందించారు. హిందూ సంఘాల నేతలతో మాట్లాడుతూ... తిరుమల శ్రీవారి అవమానించలేదని అన్నారు. సెన్సార్ బోర్డు నిబంధనల మెరకే సినిమాను తీశామని సంతానం చెప్పారు. 

లాంటి రూల్స్ అతిక్రమించలేదని అన్నారు. సినిమాలో ఎలా నటించాలి ఏంటి అనేది మాకు తెలుసని సంతానం ఫైర్ అయ్యారు. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వారు మాట్లాడే ప్రతి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని సంతానం ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ హీరో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి. సంతానం మాట్లాడిన ఈ తీరుపై కూడా హిందూ సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. తాను ఏమి చెప్పినా వినట్లేదని అంటున్నారు. శ్రీనివాస గోవిందా సినిమా పాటపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ గొడవ ఎక్కడి వరకు దారితీస్తుందోనని సంతానం అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: