ఏదైనా తేదీన స్టార్ హీరో నటించిన సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఆ తేదీన వేరే సినిమాల విడుదల తేదీలు లేకుండా మేకర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాలు పలాన తేదీన విడుదల అవుతుంది అని అనేక మూవీలు వేరే తేదీన విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకున్న సమయంలో ఒక్క సారిగా సడన్గా స్టార్ హీరో సినిమా విడుదల క్యాన్సిల్ అయినట్లయితే ఆ తేదీన ఏదైనా సినిమా వస్తే ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ.కి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ చిన్న సినిమా దక్కించుకుంది.

అసలు విషయం లోకి వెళితే ... మే 10 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అయింది. ఇక ఇదే సమయంలో టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన కింగ్డమ్ సినిమాను కూడా మే 30 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇక ఈ రెండు సినిమాల పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ హీరోలుగా రూపొందిన భైరవం సినిమాను కూడా మే 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ మూడు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఒక్క సారిగా మే 30 వ తేదీ నుండి హరిహర వీరమల్లు , కింగ్డమ్ సినిమాలు తప్పుకున్నాయి.

దానితో భైరవం సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా పోయింది. దానితో బైరవం సినిమాకు కనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ కి ఏ మూవీ నుండి పోటీ లేకపోవడంతో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి భైరవం సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో ... ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: