సీనియర్ హీరోయిన్ లయ అవకాశాల కోసం తెగ ఎదురుచూస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే చాలా రోజుల నుండి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడంతో ఎట్టకేలకు ఈ ముద్దుగుమ్మకి నితిన్ హీరోగా చేస్తున్న తమ్ముడు సినిమాలో కీ రోల్ దక్కింది.అలా ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే లయ కూతురుకి బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ -2మూవీలో ఒక రోల్ పోషించే అవకాశం వచ్చినట్టు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. ఇక లయ సినిమాల గురించి కాస్త పక్కన పెడితే..చాలా రోజుల నుండి లయ తన భర్తకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. వేలకోట్ల ఆస్తులు ఉన్న లయ ఎందుకు అమెరికా వదిలి ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చింది.. 

కోట్ల ఆస్తులు ఉండి సినిమాలు చేయాలని ఎందుకు ఫిక్స్ అయింది.నిజంగానే తన భర్తతో విడాకులు తీసుకుందా..అందుకే పిల్లల్ని తీసుకొని ఇండియాకి వచ్చేసిందా అంటూ చాలామంది సోషల్ మీడియాలో రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ తన బ్యాక్ గ్రౌండ్ గురించి, భర్తతో విడాకుల గురించి క్లారిటీ ఇచ్చింది.లయ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను మళ్ళీ సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. అందుకే అమెరికా వదిలేసి ఇండియాకి వచ్చాను. ఇక ఇండియాకు వచ్చినంత మాత్రాన నా భర్తకు నాకు గొడవలు ఉన్నాయని అర్థం కాదు. నేను విడాకులు తీసుకోలేదు. మేం కలిసే ఉన్నాం.

మా ఆయనకి అమెరికాలో చాలా క్లినిక్స్ ఉన్నాయి. అందుకే ఆయన అమెరికా వదిలి వచ్చే పరిస్థితిలో లేరు. అలాగే వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని,అంబానీకి సిస్టర్ రేంజ్ లో మాకు ఆస్తులు ఉన్నాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ నాకు వేల కోట్ల ఆస్తులు లేకపోవచ్చు. అయితే ఏది కొనుక్కోవాలి అనుకున్నా క్షణాల్లో దాన్ని కొనేయగల డబ్బులు మాత్రం ఉన్నాయి. మళ్లీ సినిమాలు చేయాలి అనే ఉద్దేశంతోనే ఇండియాకి వచ్చా. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను విడాకులు తీసుకోవడం లేదు అంటూ సీనియర్ నటి లయ సినిమాలపై, భర్తతో విడాకులపై క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: