
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్న అంశం సమంత తాజా నిర్ణయమే. ఇకపై తెలుగు సినిమాలలో నటించాలి అంటే హీరోలతో సమానంగానే రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటూ క్లారిటీగా చెప్పేసిందట. లేకపోతే ఏ కథ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఆమె డేట్లు అసలు ఇవ్వనని ఇప్పటికే పలువురు నిర్మాతలతో జరిగిన ప్రాథమిక చర్చలలో కూడా ఈ విషయాన్ని సమంత చాలా క్లియర్ గా చెప్పేసిందట. ఒక సినిమా సక్సెస్ కావాలి అంటే కేవలం హీరో మాత్రమే కాదు హీరోయిన్ పాత్ర కూడా చాలా ఉంటుంది. మరి అలాంటి కృషికి తగ్గ గౌరవం కూడా ఇవ్వాలి కదా అంటూ సమంత సమాధానాన్ని తెలుపుతోందట.
గత కొన్నేళ్లుగా గ్లోబల్ స్థాయిలో వెబ్ సిరీస్ లలో నటించి తన రేంజ్ ను పెంచుకున్న సమంత ఇప్పుడు సినిమాలలో కూడా అదే లెవెల్ ని మెయింటైన్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా తన సొంత నిర్మాణ సంస్థలో కూడా తెరకెక్కించే సినిమాలలో నటీనటులకు సమానమైన రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నదట సమంత. అయితే సమంత తీసుకున్న ఈ నిర్ణయం పైన తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది పాజిటివ్ మరి కొంతమంది నెగటివ్ గా కూడా రియాక్షన్ ఇస్తున్నారట. సమంత ఎలాంటి నిర్ణయం తీసుకున్న వాటి నుంచి వెనక్కి తగ్గదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నది. మరి ఈ నిర్ణయంతో నటి నిర్మాతలకు ఇబ్బందులు కలిగించేలా ఉన్నది సమంత.