తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. అలా కెరియర్ ప్రారంభంలో కథ రచయితగా పని చేసిన ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ను స్టార్ట్ చేశాడు. పటాస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దర్శకుడిగా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

పటాస్ మూవీ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 ,  భగవంత్ కేసరి , సంక్రాంతికి వస్తున్నాం అన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. అనిల్ రావిపూడి తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇకపోతే తాజాగా శ్రీ విష్ణు "సింగిల్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ ను తాజాగా ఏర్పాటు చేశారు. అందులో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... శ్రీ విష్ణు ఒక గొప్ప నటుడు. ఆయన నాకు మంచి స్నేహితుడు కూడా. ఆయనతో పని చేయాలి అని నేను అనుకుంటున్నాను. కచ్చితంగా అతనితో పని చేస్తాను అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. తాజాగా శ్రీ విష్ణు గురించి అనిల్ రావిపూడి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: