టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి పరిచయం అనవసరం. సమంత గతంలో అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వాళ్ల వీరిద్దరూ విడిపోయారు. ఇటీవలే నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నాడు. విడాకుల తర్వాత సమంత అక్కినేని కుటుంబంతో టచ్ లో లేదు. అయితే తాజాగా బుల్లితెరపై అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. ఆ అవార్డ్ ఫంక్షన్ కి అక్కినేని అమల, అలాగే సమంత కూడా హాజరయ్యారు. ఆ అవార్డ్ ఫంక్షన్ లో స్టేజ్ పైన అమల డాన్స్ చేస్తుంటే.. దాన్ని చూసి సమంత మురిసిపోయినట్లు ప్రోమోలో చూపించారు. దీంతో ఆ ప్రోమో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇటీవల సమంత నిర్మాతగా శుభం సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
 
సామ్ తెలుగుతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాల్లో నటించింది. సమంత హిందీ, మలయాళం భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ ల లిస్టులో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. అయితే ఈ అందాల భామ ఇప్పటికే నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు , రెండు నంది అవార్డులు సహా అనేక అవార్డులు సొంతం చేసుకుంది. నేడు తన పుట్టినరోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేసింది. అందులో సమంత ఏప్రిల్ నెలకు సంబంధించిన ఫొటోస్ అన్నింటిని అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోస్ కి ఏప్రిల్ ఫీల్స్ అని క్యాప్షన్ ని జత చేసింది. అంతేకాకుండా ప్రతి ఫోటోకి ప్రత్యేకంగా సబ్ క్యాప్షన్ లను కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్స్  బర్త్ డే విషెస్ తో కామెంట్ బాక్స్ ని నింపేస్తున్నారు.

 
ఇకపోతే ఈ బ్యూటీ అత్తరింటికి దారేది, ఏం మాయ చేసావె, ఓ బేబీ, యశోద, రామయ్య వస్తావయ్యా, అఆ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సామ్ తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. సమంత రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల భామ ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: