ప్రస్తుతం తెలుగు సినిమా క్రేజ్ ప్రపంచ స్థాయికి వెళ్ళిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని భాషల చిత్ర పరిశ్రమలను వెనక్కి నెట్టి తెలుగు సినిమా సత్తా చాటుతోంది. తెలుగు సినిమాలను వందలు, వేల కోట్లతో భారీ విజువల్స్ తో నిర్మిస్తూ దర్శకనిర్మాతలు తమ టాలెంట్ చూపిస్తున్నారు. తెలుగు కథల్లోనూ బలం ఉండటంతో సినిమాలను ఎవరు ఆపలేకపోతున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత తెలుగు సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప సినిమా సైతం హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది.

అయితే తెలుగు సినిమాలకు ఇప్పుడే క్రేజ్ వచ్చింది అనుకుంటే పొరపడినట్టే. ఒకప్పుడు అన్నగారు ఎన్టీ రామారావు కాలంలోనే తెలుగు సినిమా చైనా లాంటి దేశంలో ప్రభంజనం సృష్టించింది. 70 ఏళ్లకు ముందే ఈ సినిమా చైనా ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా మరేదో కాదు ఎన్టీఆర్ భానుమతి కలిసి నటించిన మల్లీశ్వరి. ఈ సినిమానే  చైనాలో విడుదలైన మొదటి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించగా ఆయనే నిర్మించారు కూడా. చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు నాగరాజు పాత్రలో భానుమతి మల్లీశ్వరి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా చైనాలోనూ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం 1951 డిసెంబర్ 25వ తేదీన అంటే ఇదే రోజు విడుదల కావడం విశేషం. అయితే సినిమా విడుదల తర్వాత మొదటి మూడు నాలుగు రోజుల వరకు పెద్దగా ఆ కానీ ఆ తర్వాత కథ ప్రేక్షకులకు ఎక్కడంతో సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ సినిమా రెండోసారి కూడా విడుదల చేయగా మొదట రిలీజ్ చేసిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం.

దీంతో మల్లీశ్వరి సినిమాను 1952లో పెకింగ్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అక్కడ అందరికీ నచ్చడంతో చైనీస్ భాషలో డబ్ చేసి 1953 మార్చి 14న అక్కడ విడుదల చేశారు. దీంతో చైనాలో విడుదల అయిన తొలి సినిమాగా మల్లీశ్వరి రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ ప్రేక్షకులు సినిమాకు ఫిదా అవడంతో ఇంగ్లీషులో కూడా డబ్బింగ్ చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల నిర్మాతలకు సాధ్యం కాలేదు. ఇక సినిమా వచ్చి 70 ఏళ్ళు అవుతుండడంతో మరోసారి మల్లీశ్వరి చిత్రాన్ని ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: