టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ నెలకొందో అందరికీ తెలిసిందే . ఒక హైడ్రామానే కొనసాగుతుంది అని చెప్పుకోక తప్పదు . మరి ముఖ్యంగా ఇన్నాళ్లు చాలా సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారి పూనకాలు వచ్చినట్లు కోపంతో ఊగిపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.  పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు టాలీవుడ్ సినీ పరిశ్రమపై ఎప్పుడూ కూడా ఘాటుగా మాట్లాడిన సందర్భాలే లేవు . అంతేకాదు పొలిటికల్ పరంగా అడపాదడపా టంగ్ స్లిప్ అయ్యాడే కానీ.. తనకి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ని మాత్రం ఎప్పుడూ నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు .


కానీ ఈసారి మాత్రం తన సినిమా విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ కుట్ర జరుగుతుంది అని స్వయంగానే ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ . అంతేకాదు కొందరు నిర్మాతలను టార్గెట్ చేస్తూ "నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థాంక్యూ.. మీ మోసాని ఎప్పటికీ మర్చిపోలేను " అంటూ కూసింత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.  పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా రన్ అవుతున్నాయి . ఇకపై ఎవరూ కూడా తనని పర్సనల్ గా కలవకూడదు అని ఏదైనా సినిమాలకు సంబంధించి హెల్ప్ కావాలి అంటే సంఘంతో రావాలి అని ఓపెన్ గానే చెప్పుకొచ్చారు .



దీంత ఒక్కసారిగా టాలీవుడ్ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల మాత్రం పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . నువ్వు రియల్ లీడర్ అన్న అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అంతేకాదు గతంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ డైలాగ్ ని విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు . హారీష్ శంకర్  దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించింది . ఈ సినిమాలో "నాకు కొంచెం త్క్కుంది కానీ దానికో లెక్కుంది " అని ఒక డైలాగ్ ఉంటుంది.



ఈ డైలాగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఇప్పటికీ సోషల్ మీడియాలో అడపాదడపా జనాలు వాడుతూనే ఉంటారు.  అయితే ఇప్పుడు మరొకసారి ఈ డైలాగులు ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . పవన్ కళ్యాణ్ కి ఒక తిక్క ఉందని దానికి ఖచ్చితంగా ఒక లెక్క ఉంటుంది అని .. పవన్ కళ్యాణ్ తిక్కని గెలికితే ప్రతి ఒక్కరి లెక్కలు మారిపోతాయి అంటూ పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ మాత్రమే కాదు ఏపీ డిప్యూటీ సీఎం కూడా ..కూసింత గౌరవం ఇవ్వండి అంటూ ఘాటు ఘాటుగానే కౌంటర్స్ వేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: