తెలుగు సినీ పరిశ్రమలో నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమెడల దర్శకత్వంలో భైరవం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మే 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ చాలా ప్రచార చిత్రాలను కూడా విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు వారు "ఏ" సర్టిఫికెట్ ను జారీ చేశారు అంటేనే అర్థం అవుతుంది. ఈ మూవీ లో భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నాయి అని. ఇక ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలు మరియు ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మూవీ లో మంచి గుర్తింపు కలిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ లు హీరోలుగా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: