
2014 సంవత్సరంలో విడుదలైన మనం మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకులకు మధురమైన అనుభూతిని పంచుతుంది. ఈ సినిమా ఏఎన్నార్ చివరి సినిమా కూడా కావడం గమనార్హం. ఈ సినిమాకు అవార్డ్ వచ్చి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇలా అన్యాయం జరిగిన సినిమాల జాబితాలో అ.ఆ సినిమా కూడా ఉంది.
నాని కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఒకటైన హాయ్ నాన్న సినిమాకు కూడా చోటు దక్కలేదు. దసరా సినిమా కమర్షియల్ గా విజయం సాధించగా ఈ సినిమాకు సైతం ఒకింత అన్యాయం జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విరాటపర్వం సినిమా కూడా మంచి సినిమా అయినప్పటికీ ఈ సినిమాకు అయితే న్యాయం జరగలేదనే సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులకు సంబంధించి కొన్ని మంచి సినిమాలకు అన్యాయం జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎంతోమంచి మెచ్చుకుంటున్నారు. తెలంగాణ సర్కార్ అవార్డులు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. ఏపీ సర్కార్ సైతం అవార్డులు ఇస్తే ఇండస్ట్రీకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే అవార్డులు ఇచ్చిన ప్రతి సందర్భంలో కొన్ని సినిమాలకు అన్యాయం జరిగిందని వినిపించడం కామన్ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ విషయంలో పెద్ద సినిమాలకే అన్యాయం జరగడం గురించి కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.