
అయితే విద్యా బాలన్ ఏ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యా బాలన్.. ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం కొనసాగాలంటే కచ్చితంగా అవకాశాలకు తగ్గట్లు మారాలని స్టేట్‌మెంట్ ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీ అంటేనే మార్పుల మయమని.. మారుతున్న కాలానికి, పరిస్థితులకు తగ్గట్లు నటీనటులు కూడా మారాలని విద్యా బాలన్ అన్నారు. ముఖ్యంగా హీరోయిన్లు తమకు వచ్చే అవకాశాలను బట్టి ఎప్పటికప్పుడు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని సూచించారు.
అప్పుడే పరిశ్రమంలో ఎక్కువ కాలం ఉండగలరని.. ఒకవేళ అలా మారలేదు అంటే వారి కెరీర్ ముగింపు దశకు చేరడం ప్రారంభమవుతుందని విద్యా బాలన్ పేర్కొన్నారు. అలాగే సినిమాల్లోకి వచ్చాక తన లైఫ్ లో అనేక మార్పులు వచ్చాయని.. పెళ్లై పిల్లలు పుట్టాక కూడా యాక్ట్ చేస్తున్నానంటే అందుకు చాలా ఆనందంగా ఉందని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు