
మనకు తెలిసిందే రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ కాంబో వేరే లెవెల్ . వీళ్ళకు కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . వీళ్ళ కాంబోలో స్టూడెంట్ నెంబర్ వన్ ..సింహాద్రి ..యమదొంగ ..ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ రాజమౌళిని వాడుకుంటూ మెగా ఫాన్స్ చేస్తున్న ట్రోలింగ్ వైరల్ గా మారింది. గతంలో రాజమౌళి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ఓ రేంజ్ లో పొగిడేసారు .
"పవన్ కళ్యాణ్ తన మేనరిజంతో ఒక్కసారి చేతితో మెడ పట్టుకుంటే చాలు ఆయనకు ఆడియన్స్ పల్స్ తెలిసిపోతుంది . ఆ ఒక్క షాట్ వేసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తే గూస్ బంప్స్ పక్క.. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అందరికీ తెలిసిందే" అంటూ రాజమౌళి మాట్లాడిన వీడియో క్లిప్ ను వైరల్ చేస్తూ ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారు కొంతమంది మెగా ఫాన్స్ . ఎన్టీఆర్ - రాజమౌళి కాంబోలో ఇప్పటికే నాలుగు సినిమాలు దాకా వచ్చాయి . అన్ని హీట్లే కానీ ఏ రోజైనా సరే రాజమౌళి ఈ విధంగా క్రేజ్ కా బాప్ అనే రేంజ్ లో ఎన్టీఆర్ ని పొగిడాడా లేనేలేదు.
బాలీవుడ్ నుంచి మొదలుకొని మాలీవుడ్ వరకు ఎవరిని అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ పేరే చెబుతారు . టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మొదటగా గుర్తొచ్చేది ఆయనే అంటూ పవన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అయితే హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కోసమే ఈ విధంగా పక్క హీరోలను టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఘాటుగా తిప్పి కొడుతున్నారు మిగతా హీరోల ఫ్యాన్స్. ఏ హీరోకి ఉండాల్సిన ఫ్యాన్ బేస్ ఆ హీరోకి ఉంటుంది. ఏ డైరెక్టర్ తో హీరోకి ఉండాల్సిన రాపో వాళ్లకు ఉంటుంది. పొగిడితేనే మంచి అనుకుంటే ఎలా..? అంటూ ఘాటుఘాటుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కౌంటర్ వేస్తున్నారు..!
SSR tho 3 film's cheshavu @tarak9999 a roju aina ni fan following gurinchi matladada 🤣
— TenTen_ 🚩 (@praveenprem04) June 1, 2025
bollywood nundi MALLUWOOD varaku a Celebritini adiga cheptharu AP/TS lo
Craze ka Baap @PawanKalyan ani 🥵 pic.twitter.com/iuY8T65kpe