పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మనం అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మొదలు పెట్టిన తర్వాత అనేక కారణాలతో అనేక సార్లు ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దానితో క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి కూడా తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో మొదటి భాగాన్ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం స్టార్ట్ అయ్యి అనేక సార్లు డిలే అవుతూ ఎట్టకేలకు పూర్తి కావడం , అలాగే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను మినహాయిస్తే పెద్దగా ప్రచార చిత్రాలు బయటకు రాకపోవడంతో ఈ మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ ఎత్తున అంచనాలు ఉన్న మామూలు ఆడియన్స్ లో ఈ మూవీ పై పెద్ద స్థాయిలో అంచనాలు లేవు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ కూడా జరగడం లేదు అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇలా ఈ సినిమాపై కాస్త నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఈ మూవీ బుక్ మై షో లో మాత్రం తన సత్తా చూపిస్తుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు ఉన్న సమయంలో ఈ మూవీ ఇప్పటికే బుక్ మై షో లో ఏకంగా 200 కే ఇంట్రెస్ట్ లను సాధించింది. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే. సినిమాపై అంచనాలు లేవు అంటున్నారు. బిజినెస్ పెద్ద రేంజ్ లో జరగడం లేదు అంటున్నారు. ఇవన్నీ ఉత్త మాటలు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయింది అంటే కలెక్షన్లు ఏ రేంజ్ లో వస్తాయి చూడండి అంటూ కొంత మంది పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: