
నందమూరి బాలకృష్ణ హీరోగా ఆశిన్ హీరోయిన్గా జయంత్ సీ పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లక్ష్మీ నరసింహ రెండు దశాబ్దాల క్రితం 2004లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి అంజి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వర్షం సినిమాలతో పోటీపడి మరి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. తమిళంలో విక్రం హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సామీ సినిమాకు రీమేక్ గా లక్ష్మీనరసింహ తెలుగులో తెరకెక్కింది. బెల్లంకొండ సురేష్ ఈ సినిమాకు నిర్మాత. అటు చిరంజీవి - ప్రభాస్ సినిమాలు పోటీలో ఉన్నా కూడా లక్ష్మీ నరసింహను దర్శకుడు జయంత్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది.
బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన తెలుగు ప్రేక్షకులు పెద్ద అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆ రోజుల్లో 277 కేంద్రాలలో 50 రోజుల పూర్తి చేసుకుంది. అయితే అదే టైంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఠాగూర్ సినిమా కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి 253 కేంద్రాలలో 50 రోజులు ఆడడంతో పాటు 192 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. లక్ష్మీనరసింహ సినిమాతో ఠాగూర్ రికార్డులు బ్రేక్ అవుతాయని అందరూ అనుకున్నారు. ఎక్కువ కేంద్రాలలో రిలీజ్ చేయడంతో లక్ష్మీనరసింహ సినిమా ఠాగూర్ సినిమా రికార్డును బ్రేక్ చేసి 277 కేంద్రాలలో అర్థశాస్త్ర దినోత్సవ జరుపుకొని టాలీవుడ్ లో అప్పటివరకు అత్యధిక కేంద్రాలలో అర్థ శత దినోత్సవం జరుపుకున్న సినిమాగా చరిత్రలో లిఖించిపోయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు