మంచు విష్ణు తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప.. తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్ ,మధుబాల, బ్రహ్మానందం, అజయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, మోహన్ బాబు తదితర సెలబ్రిటీలు నటిస్తూ ఉన్నారు. అయితే ఇందులో వీరందరితో పాటు హీరో రజనీకాంత్ కూడా తీసుకోవాలని మొదట భావించారట చిత్రబృందం. ఈ విషయం పైన తాజాగా మంచి విష్ణు క్లారిటీ ఇవ్వడం జరిగింది.


కన్నప్ప చిత్రంలో రజనీకాంత్ గారిని తీసుకోవాలనుకున్న సమయంలో ఒక క్యారెక్టర్ కూడా రాసుకున్నామని.. కానీ తన తండ్రి కాంబోలో ఆ పాత్ర ఉంటుంది.. అయితే ఆ సీన్ సరిగ్గా సెట్ కాకపోవడంతో తమ సినిమాలో కామియో పాత్ర కంటే కథకే ఇంపార్టెంట్ ఇచ్చాము అందుకే కథలో ఆ పాత్ర సెట్ అవ్వకపోవడంతో రజనీకాంత్ గారి కోసం రాసుకున్నటువంటి క్యారెక్టర్ ని కూడా తీసేసామని తెలిపారు మంచు విష్ణు.. ఇక తన తండ్రి అడిగితే కచ్చితంగా రజనీకాంత్ సారు ఒప్పుకుంటారని తెలియజేశారు మంచు విష్ణు.


కన్నప్ప సినిమా జూన్ 27న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్నది. డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని పెరకేకిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర బృందం బిజీ గా ఉన్నది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మంచు విష్ణు పాన్ ఇండియా మొట్టమొదటి మూవీ కావడం చేత అభిమానులు అయితే ఈ సినిమా పైన బారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకించి మరి కొన్ని ప్రాంతాలలో చిత్రీకరించినట్లు తెలియజేశారు మంచు విష్ణు. అటు పాటలతో మంచి క్రేజీ సంపాదించుకోవడమే కాకుండా పోస్టర్లతో కూడా బాగానే ఆకట్టుకున్నారు కన్నప్ప టీమ్.. మరి రాబోయే రోజుల్లో ట్రైలర్ తో మరింత బజ్ ఏర్పరుచుకోవాలని చూస్తోంది చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: