గత కొన్నేళ్లలో భార‌తీయ నటీనటుల రెమ్యునరేషన్ లెక్కలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు బాలీవుడ్ నటులు రూ. 100 కోట్లు తీసుకుంటున్నారు అంటే అమ్మ బాబోయ్ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రేంజ్ రెమ్యునరేషన్ టాలీవుడ్, కోలీవుడ్‌ హీరోలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్‌ కింగ్‌గా సత్తా చాటుతున్నాడు. అయితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ వంటి దిగ్గ‌జాల‌ను బీట్ చేసి ఇండియాలో అత్యధిక పారితోషికం పొందిన నటుడు ఒకరు ఉన్నారు. ఆయన నిమిషానికి రూ. 4 కోట్లకు పైగా ఛార్జ్ చేశాడు. ఇటువంటి రికార్డ్ ఇంతవరకు ఏ హీరో పేరిట నమోదు కాలేదు.


ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్. పైగా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నది ఒక తెలుగు సినిమాకు. ఆ మూవీ మరేదో కాదు `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించారు. అయితే ఆర్ఆర్ఆర్‌లో రామ్ చ‌ర‌ణ్ తండ్రిగా వెంకట్రామరాజు పాత్ర‌ను అజ‌య్ దేవ‌గ‌న్ పోషించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే ఆయ‌న క్యారెక్ట‌ర్ నిడివి చిన్న‌దే అయినా.. క‌థ‌లో కీల‌కంగా ఉంటుంది.


మొత్తం ఎనిమిది నిమిషాల పాటు అజ‌య్ దేవ‌గ‌న్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో క‌నిపిస్తారు. అందుకు గానూ ఆయ‌న తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. అక్ష‌రాలా రూ. 35 కోట్లు. అంటే నిమిషానికి రూ. 4.35 కోట్లు. నిమిషాల ప‌రంగా చూసుకుంటే.. ఇండియన్ ఫిల్మ్ హిస్ట‌రీలో ఏ న‌టుడు వ‌సూల్ చేయ‌ని అత్య‌ధిక రోజువారీ రెమ్యున‌రేష‌న్ ఇది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: