- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లోనే తిరుగు లేని ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం అఖండ - వీరసింహారెడ్డి - భగవంత్‌ కేసరి - డాకు మహారాజు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందుకు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తి అయిన‌ వెంటనే గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గోపీచంద్ మల్లినేని తాజాగా తన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. గాడ్ ఆఫ్ మాసెస్ ఇస్ బ్యాక్ .. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంది బాలకృష్ణతో కలిసి మరోసారి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయి చిత్రం అవుతుందని పేర్కొన్నారు.


బాలయ్య నటించిన 111వ ప్రాజెక్టు ఇది వాస్తవంగా చూస్తే బాలయ్య ప్రస్తుతం వరుసగా సూపర్ డూపర్ హిట్స్ అయినా కూడా చివరి 4 హిట్ సినిమాలలో వీర సింహారెడ్డి వీక్‌ సినిమా. కేవలం అఖండతో పాటు బాలయ్యకు ఉన్న క్రేజ్ వల్లే వీర సింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర గ‌ట్టెక్కింది. డాకు మహారాజ్ భగవత్ కేసరి అఖండతో పోలిస్తే ఖచ్చితంగా వీరంహా రెడ్డి వీక్ స్టోరీ అని చెప్పాలి. ఇక మళ్ళీ నేను గోపీచంద్ ఎప్పుడు కూడా రొటీన్ కథ‌లని అటూ ఇటూ తెప్పి ఎలివేషన్ ఇస్తూ సినిమాలు చేస్తారన్న టాక్ కూడా ఉంది. మరోసారి బాలయ్య మ‌లినేని గోపీచంద్ తో అంటే కాస్త రిస్క్ చేస్తున్నాడా ? అన్న గుసగుసలు అభిమానుల్లోనే వినిపిస్తున్నాయి. మ‌రి ఈ సారి అయినా గోపీచంద్ కొత్త క‌థ‌తో మెప్పిస్తాడేమో ? చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: