
ఇక ఈ సినిమాలో నటిస్తోన్న నటీనటుల విషయానికి వస్తే కింగ్ నాగార్జున ఇటీవల బ్లాక్‌బస్టర్ నా సామి రంగాతో పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ధనుష్ సర్ - రాయన్ వంటి సినిమాలతో తన విజయవంతమైన రేస్ కొనసాగిస్తున్నాడు, ఇక హీరోయిన్ రష్మిక మందన్న అనేక పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లతో స్వింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే కుబేర థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుత స్పందన వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పుడు తెరవడంతో, ప్రధాన నగరాల్లోని థియేటర్లు టికెట్ల అమ్మకాలలో ఫుల్ స్వింగ్ కనిపిస్తోంది. ఇది సినిమాపై పెరుగుతోన్న క్రేజ్‌ను సూచిస్తోంది.
బుక్‌మైషో వంటి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కుబేరా ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకుంది, గత 24 గంటల్లోనే 12 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఊపు ఇలాగే కొనసాగితే కుబేరకు బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్ పక్కాగా వస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు