
బిగ్ బాస్ షో సీజన్4 కంటెస్టెంట్ గా లాస్య వ్యవహరించగా ఈ షో ఆమె కెరీర్ కు ప్లస్ కాలేదనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మాత్రం ఆమె పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. లాస్య భర్త పేరు మంజునాథ్ అనే సంగతి తెలిసిందే. లాస్య దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పిన లాస్య ఇప్పుడు మాత్రం ఆర్థికంగా స్థిరపడ్డారనే చెప్పాలి.
ఫాదర్స్ డే సందర్భంగా టాటా ఆల్ట్రోజ్ కారును గిఫ్ట్ గా ఇవ్వగా ఈ కారు ఖరీదు 10 లక్షల రూపాయలు అని సమాచారం. చిన్నప్పటి నుంచి నాన్నకు కారులో తిరగాలని కోరిక అని పెళ్లి తర్వాత నేను కొనుగోలు చేసిన కొత్త కారుకు సైతం నాన్న ఈ.ఎం.ఐ చెల్లించారని లాస్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు ఉన్నాయని అందుకే నాన్నకు కారును కొనిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
ఈ కారుకు సంబంధించిన ఫోటోలను లాస్య ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లాస్య స్వస్థలం కడప కాగా ఆమె కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాస్య చేసిన కొన్ని వీడియోల గురించి నెగిటివ్ కామెంట్లు ఆమె మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందడుగులు వేశారు. పలు సినిమాల్లో సైతం నటించిన లాస్య కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.