గత కొంత కాలం నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్ డే మరియు ఇతర ప్రత్యేక రోజులను పురస్కరించుకుని వారి కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రాలను మళ్లీ థియేటర్స్ లోకి తీసుకువస్తున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరు నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ `స్టాలిన్` ను 4కె వెర్ష‌న్ లో విడుదల చేయబోతున్నారు.


అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ స్వామి నాయుడు తాజాగా స్టాలిన్ మూవీ రీ రిలీజ్ పోస్ట‌ర్ ను  కూడా రిలీజ్ చేయడం జరిగింది. 2006లో విడుదలైన సందేశాత్మక చిత్రమే స్టాలిన్. ఏ ఆర్ మురుగదాస డైరెక్ట్ చేసిన ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఖుష్బూ సుందర్, ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్‌ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషించగా.. మ‌ణిశ‌ర్మ‌ సంగీతం అందించారు.
చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మించిన స్టాలిన్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది. సరిగ్గా 19 ఏళ్ల‌ క్రితం విడుదలై ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఉత్తమ సందేశాత్మక చిత్రంగా నంది అవార్డును కూడా అందుకుంది. మరి రీరిలీజ్ లో స్టాలిన్ సినిమా ఎటువంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: