స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉప్పుకప్పురంబు.. ఈ సినిమా డైరెక్టర్గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది. డైరెక్టర్ ఐవీ శశి తెరకెక్కించారు.అయితే డైరెక్టర్ కి పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ కీర్తి సురేష్, సుహాసు వంటి వారిని ఒప్పించడంలోని మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఈ రోజున డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లోని స్ట్రిమింగ్ అవుతోంది. ట్రైలర్, టీజర్ లోనే సినిమా కామెడీ సినిమా అన్నట్లుగా కనిపించింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా  ఆకట్టుకుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


ఉప్పుకప్పురంబు సినిమా స్టోరీ విషయానికి వస్తే.. రానా వాయిస్ తో ఈ సినిమా కథ మొదలవుతుంది..1990 లలో జరిగేటువంటి గ్రామీణ కథ నేపథ్యంలో ఉన్నది. చిట్టి జయపురం అనే గ్రామంలో పెద్దగా ఉన్న శుభలేఖ సుధాకర్ మరణిస్తారు.. అతని కుమార్తెగా అపూర్వ (కీర్తి సురేష్) ను గ్రామ పెద్దగా నియమిస్తారు. అయితే ఈమెను గ్రామ పెద్దగా నియమించడం ఇష్టం లేనటువంటి భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) ఇద్దరు కూడా రెండు వర్గాలుగా విడిపోయి మరి ఆమెను ఇబ్బంది పెట్టేందుకే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఆ ఊరికి ఒక పెద్ద సమస్య వస్తుంది. ఆ ఊరిలో సాంప్రదాయం ప్రకారం ఎవరు మరణించిన కూడా ఊరికి ఉత్తరాన పాతి పెట్టడం ఆనవాయితీగా ఉంటుంది. అలా చివరికి పాతిపెట్టి స్మశానం కూడా నిండిపోతుంది. కేవలం నలుగురికి మాత్రమే చోటు ఉండడంతో ఆ నలుగురిని కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేలా నిర్ణయించుకుంటారు. కానీ అనుకోకుండా మరొక నలుగురు మృతి చెందడంతో చివరికి.. ఆ నలుగురిని పాతి పెట్టారా? ఆ ఊరికి స్మశాన కాపరిగా ఉన్న (సుహాస్) ఒక మోసం చేయడం బయట పడుతుంది. చివరికి ఈ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అనేది మిగతా స్టోరీ.


ప్లస్ విషయానికి వస్తే..
సినిమా స్టోరీ కొత్తగా ఉంది.
కీర్తి సురేష్, సుహాస్ కనిపించే ప్రతిసారి కూడా కామెడీ హైలెట్గా నిలిచింది. వీరిద్దరి నటన అద్భుతంగా ఉంది.
సెకండ్ పార్ట్ లో సుహాస్ తల్లి పాత్ర ప్రేక్షకులను హత్తుకునేలా ఉన్నది.
ఉప్పుకప్పురంబు సినిమా ఒక సరికొత్త వరల్డ్ లోకి తీసుకు వెళుతుంది.
సినిమాలోని డైలాగులు నాచురల్ గానే కనిపించాయి. టెక్నికల్ పరంగా కూడా సూపర్ గా ఉంది.


మైనస్:
సందర్భానుసరంగా  కామెడీ సన్నివేశాలు రాకపోవడం.
ఇందులో కొంతమంది ఆర్టిస్టులు ఓవర్ యాక్టింగ్ గా అనిపిస్తుంది.


ఓవరాల్ గా ఫ్యామిలీతో కలిసి చూసే.. ఫుల్ కామెడీ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: