
ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా జబర్దస్త్ షో అరుదైన రికార్డ్ సృష్టించింది. బుల్లితెరపై ఈ కామెడీ షో ఏకంగా 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ లో 12 ఇయర్స్ సెలబ్రేషన్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నాగబాబు సందడి చేశారు. అలాగే యాంకర్స్ అనసూయ, రష్మీతో పాటు అప్పటి టీమ్ లీడర్స్ ధన్‌రాజ్, వేణు, అదిరే అభి, షకలక శంకర్, చలాకీ చంటి, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర ఇలా అందరూ పాల్గొన్నారు.
ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో నాగబాబు ఎంట్రీ హైలెట్ గా నిలిచింది. `కావాల్సిన వాడు వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంట్రా కుయ్యా.. మనల్ని ఎవడ్రా ఆపేది` అంటూ నాగబాబు డైలాగ్ చెప్పడం మరింత ఆకట్టుకుంది. అయితే జబర్దస్త్ 12 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో రోజా మాత్రం కనిపించలేదు. మరి రోజాని మల్లెమాల టీమ్ ఆహ్వానించలేదా? లేక పిలిచినా ఆమె రాలేదా? అన్నది తెలియాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు