
మరీ ముఖ్యంగా ఈ సినిమాకి హ్యూజ్ నెగటివ్ టాక్ రావడం ఇప్పుడు బిగ్ మైనస్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాలో "నితిన్" పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ ఆయన కధల చూసింగ్ బాగాలేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. నితిన్ కధల చూసింగ్ బాగోలేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తానికి బాక్స్ ఆఫిస్ వద్ద "తమ్ముడు" సినిమా ఫ్లాప్ గా మారిపోయింది . ఈ మధ్యకాలంలో నితిన్ హిట్ కొట్టిందే లేదు బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫ్లాప్ లే. తమ్ముడు సినిమాకి దిల్ రాజుకి భారీగానే నష్టం వచ్చింది అంటూ టాక్ వినిపిస్తుంది. మొదటి మూడు రోజుల్లో మూడు కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టిన తమ్ముడు సినిమా నాలుగో రోజు వసూలు దారుణంగా పడిపోయాయి.
రెండు రాష్ట్రాలకు కలిపి 16 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయట . ఈ లెక్కలు చూసుకుంటే నాలుగు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాలలో మొత్తం రెండు కోట్ల 42లకు లక్షల రూపాయలు అంటూ తెలుస్తుంది . ఐదవ రోజు పరిస్థితి మరింత దిగజారిపోయింది. హైదరాబాద్ వంటి టాప్ సిటీలల్లో థియేటర్ల అద్దె కూడా తిరిగి సంపాదించుకోలేకపోయింది అంటూ కొంతమంది జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ గణాంకాలు సినిమాకి ప్రేక్షకుల ఆదరణ లభించలేదు అని ఈజీగా చెప్పేస్తున్నాయి . దీంతో నితిన్ కెరియర్ పై చాలా సందేహాలు ఏర్పడుతున్నాయి . మరి ముఖ్యంగా నితిన్ స్టోరీస్ సెలక్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ సినీ పెద్దలు సూచిస్తున్నారు. ఒకవేళ ఇదే తప్పు మళ్ళీ చేస్తే ఆయన సినీ కెరియర్ ముగిసిపోవడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి . చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా తన సినిమా కథల విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు నితిన్ అనేది...??