ఒకటి రెండు సినిమాల తోనే స్టార్ గా మారిపోయే హీరోయిన్‌ల కు కొదవ లేదు . కానీ అందం , అభినయం ఉన్నా సరే కొందరికి మాత్రం ఫేట్ వర్క్ అవ్వదు . అలాంటి వారిలో నభా నటేష్ ఒకరు. కన్నడ సినిమాల తో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, 'నన్ను దోచుకుందువటే' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది . ఈ సినిమాలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ యూత్‌లో హవా సృష్టించాయి. అయితే ఆ సినిమా అంచనాల మేరకు హిట్ అవకపోయినా, నభా కు అవకాశాలు మాత్రం వరుస గా వచ్చాయి .
 

ఇక ఆతర్వాత వచ్చిన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తో నభా కెరీర్ బిగ్ లెవెల్ లోకి ఎక్కింది. రామ్ సరసన ఆమె పాత్ర, గ్లామర్ షో, ఎనర్జీ - అన్నీ యూత్‌ని మాయలో పడేశాయి . ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే సమయం లో ఆమెకి టాలీవుడ్ లో భారీ క్రేజ్ వచ్చింది . కానీ అంతా అనుకున్నట్టే జరగలేదని చెప్పుకోవాలి. అవకాశాలు పెరుగుతున్న సమయం లోనే ఆమెకు ఒక రోడ్డు ప్రమాదం ఎదురైంది. ఆ యాక్సిడెంట్ లో ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో రెండు సంవత్సరాలు ఆమె బెడ్ పైనే గడపాల్సి వచ్చింది .



అది ఆమె కెరీర్ లోనే కాదు , వ్యక్తిగత జీవితం లో కూడా పెద్ద షాక్ . కానీ ఆమె ధైర్యంగా కోలుకుంది . మళ్లీ సినిమాల కు రీ ఎంట్రీ ఇచ్చింది. 'డార్లింగ్' అనే చిత్రం చేసింది కానీ అది పెద్ద గా నడవలేదు . ఇప్పుడు ఆమె తాజా ప్రయత్నం – పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభు’. ఈ సినిమా తో మళ్లీ మెరిసేందుకు రెడీ అవుతోంది నభా. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ, గ్లామర్ హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది .



మరింత సమాచారం తెలుసుకోండి: