
బిగ్ బాస్ 8వ సీజన్లో కంటెస్టెంట్ ఫిజికల్ టాస్క్లలో చాలా అలసిపోయారని అందులో కూడా చాలా ప్రెషర్ ఉందని చాలామంది ఆందోళన చేశారు. ఈసారి ఫిజికల్ టాస్క్లను తగ్గించి మరి పర్సనాలిటీ, బిహేవియర్, ప్రెజర్ లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నట్లు సమాచారం. వీటికి తోడు ప్రతి వారం ఇంటి నుంచి ఒక పార్టీస్పేషంట్స్ ని ఎలిమినేట్ చేయడానికి సరికొత్త పద్ధతిని అవలంబించబోతున్నారట.
బిగ్ బాస్ 9 పైన చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు కంటెస్టెంట్ లిస్టు పైన కూడా మరింత ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇందులో నవ్య స్వామి, సుమంత్ అశ్విన్, రీతూ చౌదరి తో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి కొత్త సీజన్లో కామన్ పీపుల్స్ అనే పాయింట్ ను తీసుకోవచ్చారు. వీటి ద్వారా సామాన్యులు కూడా షోలోకి ఎంట్రీ ఇవ్వడం ఈజీ అవుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అయితే బిగ్ బాస్ 9 లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు అన్ని సీజన్లను సక్సెస్ఫుల్గా రన్ చేసిన బిగ్ బాస్ షో 9వ సీజన్ ని సెప్టెంబర్ నెలలో నుంచి మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట.